ASBL Koncept Ambience

వాషింగ్టన్ లో ఘనంగా జిడబ్ల్యుటిసిఎస్ ఉగాది వేడుకలు

వాషింగ్టన్ లో ఘనంగా జిడబ్ల్యుటిసిఎస్ ఉగాది వేడుకలు

గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. మేరీలాండ్‌లోని గేయితర్స్‌ బర్గ్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఉగాది వేడుకలకు ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. మేరీలాండ్‌, వాషింగ్టన్‌ డీసి, వర్జీనియా రాష్ట్రంలో ఉన్న తెలుగువారు తమ కుటుంబంతో ఈ వేడుకలకు తరలివచ్చారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా తానా ప్రెసిడెంట్‌ జంపాల చౌదరి, అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి, తానా నాయకుడు గంగాధర్‌ నాదెళ్ల, ప్రసాద్‌ నల్లూరి తదితరులు వచ్చారు. తొలుత పంచాంగ శ్రవణంతో కార్యక్రమాలను ప్రారంభించారు. చిన్నారులు, యువతీ యువకులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిధిగా వచ్చిన జంపాల చౌదరి, జయరామ్‌ కోమటిని జిడబ్ల్యుటిసిఎస్‌ తరపున స్థానిక ప్రముఖులు హేమప్రసాద్‌ యడ్ల, సతీష్‌ వేమన జిడబ్ల్యుటిసిఎస్‌ ప్రెసిడెంట్‌ కిషోర్‌ దంగేటి తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ మన్నె, నరేన్‌ కొడాలి, అప్పన్నగారి జయదేవ్‌, రామ్‌ చౌదరి ఉప్పుటూరితోపాటు జిడబ్ల్యుటిసిఎస్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :