ASBL Koncept Ambience

వైభవంగా హేరీస్‌బర్గ్‌ ఉగాది వేడుకలు

వైభవంగా హేరీస్‌బర్గ్‌ ఉగాది వేడుకలు

హేరీస్‌బర్గ్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను స్థానిక కళాకారులతో ప్రదర్శించారు. దాదాపు 300కుపైగా కళాకారులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆటలు, పాటలతో సాగిన ఈ వేడుకలకు 50మందికిపైగా కొరియోగ్రాఫర్లు, కో ఆర్డినేటర్లు సహకారాన్ని అందించారు. 25కిపైగా ప్రోగ్రామ్‌లతో అలరించిన ఈ వేడుకలకు వచ్చినవారికి సంప్రదాయ వంటకాలను వడ్డించారు. 

అధ్యక్షుడు మధుకోక మాట్లాడుతూ, వచ్చినవారికి శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ సంఘం తరపున చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. రానున్న నెలల్లో కూడా మరిన్ని కార్యక్రమాలను చేయనున్నట్లు తెలిపారు. మేలో మదర్స్‌ డే, జూలైలో జస్ట్‌ ఆన్‌ లేడీస్‌, రెడ్‌ క్రాస్‌తో కలిసి సంవత్సరంలో రెండుసార్లు బ్రడ్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నామన్నారు. సంవత్సరానికి రెండుసార్లు హైవేని అడాప్ట్‌ చేసుకుని కార్యక్రమాలు చేయడం, హెచ్‌టిఎ ఆటల పోటీలను మే ` జూన్‌ మధ్య నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆగస్టులో సమ్మర్‌ పిక్నిక్‌, అక్టోబర్‌లో దసరా, బతుకమ్మ వేడుకలు, నవంబర్‌లో థాంక్స్‌ గివింగ్‌ ఫుడ్‌ డ్రైవ్‌, 4 దక్షిణ భారత రాష్ట్రాల కలయిక పేరుతో కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు మధుకోక వివరించారు. అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

ఈ వేడుకల్లో అసోసియేషన్‌ సెక్రటరీ శ్రీధర్‌ నాగమళ్ళ, ట్రెజరర్‌ మునికుమార్‌ గిల్ల, కో ఆర్డినేటర్‌ ` పిఆర్‌ కమ్యూనికేషన్స్‌ రాజేందర్‌ మల్లు, ఎంటర్‌ టైన్‌మెంట్‌ కో ఆర్డినేటర్‌ లక్ష్మీ నరసయ్య విశ్వనాధుని, కో ఆర్డినేటర్‌ స్పోర్ట్స్‌ శ్రీనివాస్‌ కాకర్ల, వెబ్‌ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ మధు మోహన్‌ మేకల, స్పాన్సర్‌ షిప్‌-సంతోష్‌ మిట్టపల్లి, ఫుడ్‌ - మధుమోహన్‌ లక్కరాజు, మెంబర్‌ షిప్‌, కమ్యూనిటీ సర్వీసెస్‌ - ప్రదీప్‌ గోపు, కో ఆర్డినేటర్‌ ఫుడ్‌ అండ్‌ స్పాన్సర్‌ షిప్‌ - జనార్ధన్‌ కర్నాటితోపాటు, బోర్డ్‌ డైరెక్టర్లు ఆదినారాయణరావు రాయవరపు, కృష్ణ రేపాక, రమేష్‌ బత్తిని, ఎస్‌విఆర్‌ రెడ్డి, బాబా సొంత్యన, బసవ శంకర్‌, సతీష్‌ చుండ్రు, ఆత్రేయ సిందిరి, సదానందం భారత, శ్రీనివాస్‌ బండి, సునంద కుమార్‌ కంభం, విభీషణ్‌ గీరెడ్డి, లక్ష్మణ్‌ బుద్దినేని, సాంబశివారెడ్డి ఎల్లంకి, కిషోర్‌ కొంక, డా. రాజేశ్‌ సూరపనేని, సందీప్‌ కొండకింది తదితరులు ఈ కార్యక్రమాల విజయవంతానికి సహకరించారు. 

 

Click here for Event Gallery

 

 

Tags :