టీడీపీలో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్
అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షకుమార్‌కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడుకు హర్షకుమార్ శాలువా కప్పి అభిమానాన్ని చాటుకున్నారు. హర్షతో పాటు ఆయన కుమారుడు జీవీ శ్రీహర్షకు సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జీవీ హర్షకుమార్ చాలా సమర్థడైన నాయకుడన్నారు. కొత్తగా మన కుటుంబంలోకి వచ్చిన సభ్యుడన్నారు. టీడీపీ గెలవడం చారిత్రక అవసరమన్నారు.
Tags :