తానా టీమ్ స్క్వేర్ సహాయం...విద్యార్థుల మృతదేహాలు స్వస్థలానికి
ఒక్లహోమా రాష్ట్రంలో విహారయాత్రకు వెళ్ళి ప్రమాదవశాత్తు మరణించిన తెలుగు విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు పంపేందుకు తానా టీమ్ స్క్వేర్ వలంటీర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరణించిన కేధార్‌నాథ్, తేజ కౌశిక్, అజయ్ మృతదేహాలను భారత్‌కు పంపేలా అవసరమైన దరఖాస్తులను తానా టీమ్‌స్క్వేర్ వలంటీర్లు భారత కాన్సులేట్‌కు పంపారు. వీరి మృతదేహాలు శనివారం సాయంత్రం ఇండియాకు చేరుతాయని తానా వర్గాలు తెలిపాయి. తానా టీం స్క్వేర్ అధ్యక్షుడు అశోక్‌బాబు కొల్లా, తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి తదితరులు విద్యార్థుల మృతదేహాలను తరలించడంలో అవసరమైన సహకారాన్ని అందించారు.
న్యూజెర్సిలో ఉంటున్న అజయ్ మావయ్య తానా చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. తానా చేస్తున్న సేవను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశానని వారు చేసిన సేవలు వెలకట్టలేనివని ఆయన చెప్పారు.
Tags :