ఫిలడెల్ఫియా లో బాలకృష్ణ కి ఘన స్వాగతం
నిన్ననే తానా మహా సభల కోసం చేరుకొని, అక్కడి తానా నాయకులను, తన అభిమానులను అలరించిన హీరో బాలకృష్ణ నేడు ఉదయం ఫిలడెల్ఫియా చేసుకొన్నారు.
తానా మహా సభలు జరిగే కన్వెన్షన్ సెంటర్ దగ్గర లో వున్న షరటొన్ హోటల్ లో తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీ రవి పొట్లూరి మరియు ఇతర నాయకులు ఘన స్వాగతం తెలిపారు. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ అభిమానులు చేసిన హర్షధ్వానాలతో ఆ ప్రదేశం అంతా మోగిపోయింది. అనేక మంది అభిమానులు ఆయనకు పూల గుచ్చం ఇవ్వటానికి క్యూ కట్టారు. శ్రీ బాలకృష్ణ కూడా చిరునవ్వుతో ఓపికగా అందరికీ తనతో ఫోటో తీసుకొనే అవకాశం ఇచ్చారు. చాలామందిని గుర్తు పట్టి పలకరించారు.
Tags :