వైయస్సార్‌సీపీలో సినీ నటుడు మోహన్‌బాబు
వైయస్ జగన్ సమక్షంలో ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు వైయస్సార్‌సీపీలో చేరారు. పార్టీ తరపున ప్రచారం చేసేందుకు మోహన్ బాబు నడుం బిగించారు. చంద్రబాబు వ్యవహార శైలిని ముందు నుంచి తూర్పారబడుతోన్న మోహన్‌బాబు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం తిరుపతి వద్ద విద్యార్థులతో పాటు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మనుషులు తనను రెచ్చగొడితే చంద్రబాబు అసలు బండారాన్ని బయట పెడతానని హెచ్చరించారు. చంద్రబాబు అక్రమాలు అవినీతి గురించి బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని ఆయన ఇది వరకు ప్రకటించారు.
Tags :