తానా ఎన్నికలు - హితేష్ వడ్లమూడి ఏకగ్రీవ ఎన్నిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ పదవికి పోటీ పడిన హితేష్ వడ్లమూడి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తానా ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఆయన నిరంజన్ వర్గం తరపున ఈ పదవికి పోటీ పడ్డారు. కాగా నరేన్ వర్గం తరపున ఈ పదవికి పోటీ పడ్డ హేమకానూరు నామినేషన్‌ను నిబంధనల ప్రకారం సరిగా లేనందున తిరస్కరించినట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. నామినేషన్‌లో తానా సభ్యుల సంతకాలు కూడా ఉండాలన్న నిబంధనను ఆయన పాటించకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. దీంతో ఈ పదవికి హితేష్ వడ్లమూడిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
Tags :