హౌడీ మోదీ అనూహ్య విజయం : నిక్కీ హేలీ
టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో జరిగిన హౌడీ మోదీ విజయవంతం కావడంపై ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ప్రశంసలు కురిపించారు. ఇరుదేశాల మధ్య గొప్ప భాగస్వామ్యం ఉందని, డొనాల్డ్ ట్రంప్, మోదీల మధ్య ఈ స్నేహంతో ఇది మరింత బలపడుతుందని ఆమె వెల్లడించారు. వీరిద్దరి స్నేహంతోనే భారత్ అమెరికా మధ్య బంధం మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. భారత్ అంటే అమెరికాకు ఎంతో ప్రేమ అని పేర్కొంటూ ట్రంప్ చేసిన ట్వీట్‌ను కూడా ఆమె రీట్వీట్ చేశారు. పంజాబ్‌కు చెందిన ప్రవాసభారతీయ దంపతుల కుమార్తె అయిన నిక్కీ హేలీ భారత అమెరికన్‌గా ఇరుదేశాల మధ్య బంధం మరింత బలోపేతం కావడానికి కృషి చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ కరోలినా గవర్నర్‌గా కూడా నిక్కీ హేలీ పనిచేశారు.
Tags :