ASBL Koncept Ambience

నాటా మహాసభలకు భారీ ఏర్పాట్లు

నాటా మహాసభలకు భారీ ఏర్పాట్లు

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) డల్లాస్‌ నగరంలో జూన్‌ 30 నుండి జూలై 2వ తేది వరకు చరిత్ర లోనే అతి పెద్ద ఎత్తున మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమవుతున్నది. డల్లాస్‌ లోని కే బైలీ హచిన్సన్‌ సెంటర్‌ లో అసంఖ్యాకమైన అభిమానుల మధ్య జరిగే  ఈ మహోత్సవానికి ఎందరో అతిరధ మహారధులైన తెలుగు సినీ, రాజకీయ, సాంస్కృతిక, పాత్రికేయులు, జానపద కళాకారులు, క్రీడాకారులు, వ్యాపార వేత్తలు, సంగీత ప్రముఖులు తరలి రానున్నారు. నాటా తెలుగు సాంప్రదాయాలను, కళలను, సంగీతాన్ని అపూర్వమైన స్థాయిలో ప్రదర్శించడానికి సంఘటిత ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రవణ్‌ కుమార్‌ తో కన్నుల పండుగైన ఫ్యాషన్‌ షో నిర్వహిస్తున్నారు. ఇంకా ప్రముఖ సినీ నృత్య దర్శకురాలు అనీ మాస్టర్‌ శిక్షణ పర్యవేక్షణలో స్థానిక పిల్లల జానపద, సినీ నృత్య ప్రదర్శనలు అలరించబోతున్నాయి.  

ఈ సంబరాన్ని అంబరానికి చేర్చడానికి, ప్రేక్షకులని అలరించడానికి రామ్‌ గోపాల్‌ వర్మ,మెర్లపాక గాంధి, శ్రీనివాస రెడ్డి, ఆలీ, లయ గోర్తి, పూజ ఝవాల్కర్‌, స్పందన పల్లి, అనసూయ, ఉదయ భాను, రవి, రోషన్‌, రవళి లాంటి ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం జరుగుతోంది. కన్వెన్షన్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా మూడు రోజులు ముగ్గురు టాలీవుడ్‌ అగ్ర సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్‌, థమన్‌, అనూప్‌ రూబెన్స్‌ తమ బృందాలతో చేసే సంగీత విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

నాటా అద్యక్షుడు డాక్టర్‌ కొర్సపాటి శ్రీధర్‌ రెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ హరి వేల్కూర్‌, పూర్వాధ్యక్షుడు డాక్టర్‌ గోసాల రాఘవ రెడ్డి, సెక్రటరీ గండ్ర నారాయణ రెడ్డి మొదలుగా గల ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, మహా సభల కన్వీనర్‌ - ఎన్‌ఎంఎస్‌ రెడ్డి, సమన్వయకర్త డాక్టర్‌ బూచిపూడి రామిరెడ్డి, కో -కన్వీనర్‌ కోడూరు కృష్ణా రెడ్డి,కో-కో ఆర్డినేటర్‌ గండికోట భాస్కర్‌ రెడ్డి, డిప్యూటీ కన్వీనర్‌ క్రిష్టపాటి రమన్‌ రెడ్డి, డిప్యూటీ కోర్డినేటర్‌ ఆవుల మల్లిక్‌, బోర్డు అఫ్‌ డైరెక్టర్స్‌ జయచంద్రా రెడ్డి, పాముదుర్తి  పవన్‌, పుట్లూర్‌ రమణ, అరిమండ రవీంద్ర, బత్తుల విష్ణు, RPVs ఆదిత్య రెడ్డి, కొరివి చెన్నా, వైశ్యరాజు మధుమతి, చొప్ప ప్రసాద్‌, పోలు రాజేంద్ర, వేముల వీరా రెడ్డి  సభలు విజయవంతం కావడానికి కృషిచేస్తున్నారు.

 

 

Tags :