ASBL Koncept Ambience

తానా వనభోజనాలకు భారీ ఏర్పాట్లు

తానా వనభోజనాలకు భారీ ఏర్పాట్లు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియా టీమ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజనాలకు అందరూ రావాల్సిందిగా తానా టీమ్‌ ఓ ప్రకటనలో కోరింది. సెప్టెంబర్‌ 29వ తేదీన ఫిలడెల్ఫియాలోని కాలేజ్‌ విల్లే, ఎవాన్స్‌బర్గ్‌ స్టేట్‌ పార్క్‌లో ఈ వనభోజనాలను ఏర్పాటు చేశారు. ఈ వనభోజనాల్లో అందరూ మెచ్చే విధంగా వంటకాలను కూడా ఏర్పాటు చేశారు. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, పనసకాయ బిర్యానీ, వెజిటబుల్‌ బిర్యానీ, వంకాయ టమోటా రోటి పచ్చడి, గోంగూర రోటి పచ్చడి, చపాతీ, పాలకూర పప్పు, వెజిటబుల్‌ కుర్మా, బంగాళాదుంపల కూర. పప్పు చారు, పెరుగన్నం. పాయసం, కేసరి, అల్లం టీ, నిమ్మకాయ మజ్జిగ వంటి రుచులను ఇందులో వడ్డించనున్నారు. ఈ వనభోజనాలకు ఓ ప్రత్యేక అతిధిని కూడా పిలిచారు. చిన్నవయస్సులోనే ఎవరెస్ట్‌ శిఖరాన్ని చిన్నవయస్సులోనే అధిరోహించి చరిత్ర సృష్టించిన మలావత్‌ పూర్ణ ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మీట్‌ అండ్‌ గ్రీట్‌ పేరుతో ఆమెతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వనభోజనాల్లో పిల్లలు, పెద్దలకోసం ఆటలపోటీలను కూడా నిర్వహిస్తున్నారు. వాలీబాల్‌, అంత్యాక్షరీ, మ్యూజికల్‌ చైర్‌ ఇలా ఎన్నో పోటీలను ఏర్పాటు చేశామని, అందరూ కుటుంబసమేతంగా వచ్చి విందు భోజనాన్ని ఆరగించాల్సిందిగా తానా నాయకులు కోరారు. ఇతర వివరాలకు ఫిలడెల్ఫియా తానా టీమ్‌ను సంప్రదించవచ్చు.

 

 

 

Tags :