వైభవోపేతంగా అయుత చండీ మహాయాగం
లోకకల్యాణం కోసం తలపెట్టిన అయుత చండీ మహాయాగం నాలుగో రోజు వైభవోపేతంగా జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాగాశాలకు చేరుకున్నారు. అనంతరం పూజా కార్యక్రమాలు ప్రారంభమాయ్యాయి. ముందు మహా సరస్వతి, మహకాళి, మహలక్ష్మి విగ్రహాల ముందు గురుప్రార్ధన చేశారు. వివిధ రకాల పూలతో అలంకరించడంతో అమ్మవారి విగ్రహాలు, చండీయాగం ప్రాంగణం సువాసనలతో, ఆకర్షణీయమైన ఆకృతులతో ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, రుత్విజులు ఎరుపు వర్ణం వస్త్రాలు ధరించారు. గురు ప్రార్థనతో యాగం ప్రారంభమైంది. సప్తద్రవ్యమృత్యుంజయ హోమం, ఏకాదశన్యాసపూర్వక చతుస్సహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, మహాసౌరము, ఉక్తదేవతా జపములు, దంపతీపూజ, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ, సప్తద్రవ్య మృత్యుంజయ హోమం తదితర కార్యక్రమాలు ఉదయం పూట జరిగాయి.
Tags :