ASBL Koncept Ambience

హైదరాబాద్ ఎంపిక పై కేథరిన్ హడ్డా, మంత్రి కేటీఆర్ హర్షం

హైదరాబాద్ ఎంపిక పై కేథరిన్ హడ్డా, మంత్రి కేటీఆర్ హర్షం

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)-2017కి హైదరాబాద్‌ అన్ని విధాలా అనుకూలమైనదని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా, మంత్రి కేటీఆర్‌లు తెలిపారు. జీఈఎస్‌కు హైదరాబాద్‌కు ఎంపిక నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. జీఈఎస్‌కు ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు హాజరవుతారని, దీనికి హైదరాబాద్‌ను ఎంపిక చేయడం సముచిత నిర్ణయమన్నారు. అమెరికా-భారత్‌ల మధ్య దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వామ్యాల్లో తెలంగాణకు చారిత్రక నేపథ్యముందని చెప్పారు. ఈసారి జీఈఎస్‌లో మహిళలకు ప్రాధాన్యమిస్తున్నారని, ప్రపంచ అభివృద్ధి, అవకాశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. నీతిఆయోగ్‌ సీఈవో కాంత్‌, అమెరికా వ్యవహారాల ప్రతినిధి మేరీకే కార్ల్‌సన్‌ లు హైదరాబాద్‌ను ఎంపిక చేశారని చెప్పారు.

 

Tags :