ASBL Koncept Ambience

ఘనంగా ఇండియా డే వేడుకలు

ఘనంగా ఇండియా డే వేడుకలు

అమెరికా నలుమూలలా 71వ భారత స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ ప్లాజాలో దాదాపు 1000 మందికి పైగా ప్రవాస భారతీయులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతిపిత మహాత్మగాంధీకి ఘనమైన నివాళులు అర్పించిన ఎంజీఎంఎన్‌టీ బోర్డు డైరెక్టర్‌ షాబ్నమ్‌ మోడ్గిల్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభం సందర్భంగా చిన్నపిల్లలు ఆలపించిన దేశభక్తి గీతాలు కార్యక్రమంలో ఉత్సాహాన్ని నింపాయి.

ఎంజీఎంఎన్‌టీ సెక్రటరీ రావు కల్వల మాట్లాడుతూ శాంతి, అహింస, పద్ధతుల ద్వారా దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టడంలో కీలకపాత్ర పోషించిన జాతిపిత మహాత్మగాంధీ మెమోరియల్‌ అయిన మహాత్మగాంధీ మెమోరియల్లో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రవాసీయుల కోలాహాలం మధ్య ఎంజీఎంఎన్‌టీ చైర్మన్‌ తోటకూర ప్రసాద్‌ తివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా భారత్‌, యూఎస్‌ జాతీయ పతాకాలను చేతులతో పట్టుకుని ప్రవాసీయులు ఉత్సాహంగా కనిపించారు. అనంతరం తోటకూర ప్రసాద్‌ మాట్లాడారు. భారత స్వాతంత్య్రదినోత్సవాన్ని జరుపుకోవడానికి స్వేచ్ఛ,  ప్రజాస్వామ్య హక్కులను కల్పించిన అమెరికాకు ఋణపడి ఉండాలని ఆయన అన్నారు. అమెరికాలో భారత 71వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న తామంతా  అదృష్టవంతులమని ఆయన పేర్కొన్నారు.


Click here for Event Gallery

Tags :