ASBL Koncept Ambience

ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. డబ్లిన్‌లో 40 మంది వాలంటీర్స్ కలిసి ఈ  బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు. గత ఏడూ సంవత్సరాలుగా ఈ బతుకమ్మ వేడుకలని వాలంటీర్లు మరియు దాతల సహాయంతో ఉచితంగా నిర్వహిస్తున్నారు. సుమారు ముప్పై మంది వాలంటీర్లు మరియు నలభై మంది దాతలు ముందుకొచ్చి  బతుకమ్మ వేడుకలు జరుపుటకు  సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు  700 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ మరియు  దాండియా  ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ మరియు  దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి.   మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి  పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో  Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మను  పేర్చి తీసుకువచ్చిన ప్రతి ఆడపడుచులకు బహుమతి ప్రధానం చేసారు. వచ్చిన అతిధులకు ప్రసాదం, సాయంత్రం తేనీరు, స్నాక్స్ మరియు రాత్రి రుచికరమైన  వంటలు వడ్డించారు. ఈ బతుకమ్మ సంబరాలు జరుపుటకు మాకు సహకరించిన వాలంటీర్లు :

సాగర్  సిద్ధం, ప్రబోధ్  మేకల, కమలాకర్ కోలన్, జగన్ మేకల, వెంకట్ తిరు, దయాకర్  కొమురెల్లి, శ్రీనివాస్ కార్ప్, వెంకట్ గాజుల, త్రిషేర్ పెంజర్ల, సుమంత్  చావా, నవీన్ గడ్డం, ప్రవీణ్లాల్, అనిల్ దుగ్యాల, నరేందర్ గూడ, రమణ రెడ్డి యానాల, శ్రీనివాస్  వెచ్చ, అల్లే శ్రీనివాస్, వెంకట్ జూలూరి, రవీందర్ చప్పిడి, మహేష్  అలిమెల్ల, శ్రీనివాస్ అల్లంపల్లి, శ్రీధర్ యంసాని, శ్రీనివాస్ సిల్వెని, శ్రీనివాస్ పటేల్, షరీష్ బెల్లం కొండా, బలరాం, ప్రదీప్ రెడ్డి యల్క, నగేష్ పుల్లూరు, కొసనం శ్రీనివాస్, రామ గౌడ్, వెంకట్ అక్కపల్లి, వల్లప రెడ్డి ఉపేందర్ రెడ్డి, శ్రీధర్ రాపర్తి, సత్య పోతు, బాచి రెడ్డి, బాను బొబ్బల, శశిధర్ మర్రి, సంతోష్ పల్లె, సంపత్, వినోద్ పెరురి, రాధ కొండ్రగంటి తదితరులు.  

Tags :