కేటీఆర్‌కు అమెరికా ఆహ్వానం
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండో రోజు మహిళా సాధికారిత నైపుణ్యాభివృద్దిపై జరిగిన చర్చాగోష్టికి సంధానకర్తగా వ్యవహరించిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఈ గోష్టిని నిర్వహించిన తీరుపై అమెరికా ప్రభుత్వ సలహాదారు ఇవాంక ట్రంప్ ఫిదా అయ్యారు. గంటన్నరకు పైగా జరిగిన ఈ చర్చాగోష్టి ప్రారంభోత్సవంలో కేటీఆర్ ప్రసంగించిన తీరుపై సభికులనుంచి హర్షధ్వానాలు మిన్నంటాయి. ఉదయం 10 గంటలకు ఈ గోష్టి ప్రారంభం కావాల్సి ఉండగా అరగంట ముందే ఇవాంక ట్రంప్ అక్కడికి చేరుకున్నారు. అంతకన్నా పది నిమిషాల ముందు కేటీఆర్ సమావేశ మందిరంలోని తొలి వరుసలో ఏర్పాటుచేసిన చర్చాగోష్టిలో పాల్గొనే మహిళా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ ప్రసంగించారు. ఈ సదస్సుకు వచ్చిన వారందరికీ స్వాగతమంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన కేటీఆర్ తన గురించి పరిచయం చేసుకున్నారు. చర్చాగోష్టి ముగిశాఖ కేటీఆర్ ఇవాంక ట్రంప్‌తో రెండు నివిషాల పాటు సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా చార్చాగోష్టిని కేటీఆర్ నిర్వహించిన తీరును ఇవాంక అభినందించడంతో పాటు ఆయన సంధించిన ప్రశ్నలను ప్రస్తావిస్తూ మహిళల సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను అమెరికా రావాల్సిందిగా ఇవాంక ఆహ్వానించారు.