ASBL Koncept Ambience

భారత్‍ పర్యటనలో ట్రంప్‍తో పాటు ఇవాంకా ట్రంప్‍

భారత్‍ పర్యటనలో ట్రంప్‍తో పాటు ఇవాంకా ట్రంప్‍

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ కమార్తె ఇవాంకా, అల్లుడు జారేద్‍ కుష్నర్‍ ఆయనతో పాటు భారత్‍లో పర్యటించనున్నారు. జనవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‍ భారత్‍ పర్యటన సందర్భంగా ఆయనతో పాటు ఉండే ఉన్నత ప్రతినిధి బృందంలో వీరు సభ్యులుగా పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ట్రంప్‍ భార్య మెలానియా కూడా బృందంలో భాగంగా భారత్‍కు రానున్నారు. అదేవిధంగా ట్రెజరరీ కార్యదర్శి స్టీవెన్‍ మ్నుచిన్‍, వాణిజ్య కార్యదర్శి విల్బర్‍ రోస్‍ కూడా ఈ బృందంలో సభ్యులుగా పాల్గొంటారు. జనవరి 24న అమెరికా అధ్యక్షుడు అహ్మదాబాద్‍ చేరుతారు. 25న జరిగే మోదీ, ట్రంప్‍ల భేటీలో ఉగ్రవాద నిరోధక సహాకారం, వాణిజ్యం, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, హెచ్‍1బి వీసాలపై భారత్‍ అభిప్రాయాలు వంటి విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం.

 

Tags :