ASBL Koncept Ambience

టిటిఎ కాన్ఫరెన్స్ లో జబర్దస్త్ టీమ్

టిటిఎ కాన్ఫరెన్స్ లో జబర్దస్త్ టీమ్

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మెగా కన్వెన్షన్‌లో అందరినీ అలరించేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సినీ కళాకారులతోపాటు జబర్దస్త్‌ టీమ్‌కు చెందిన కళాకారులు కూడా తమవంతుగా ఎన్నారైలను ఈ కన్వెన్షన్‌లో అలరించనున్నారు. జబర్దస్త్‌ కళాకారులు అభి, రాఘవ తమ కళా ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకోనున్నారు.  అదిరే అభిగా పేరు తెచ్చుకున్న అభినయ కృష్ట అందరినీ మెప్పించడంలో పేరు తెచ్చుకున్నారు. అనుకరణ నుంచి కామెడి వరకు అభిప్రస్థానం సాగింది. రాఘవ కూడా జబర్దస్త్‌తో మంచి ఇమేజ్‌ తెచ్చుకున్నారుడు అందరినీ నవ్వించడంలో పేరు తెచ్చుకున్న రాఘవ కూడా ఈ కన్వెన్షన్‌లో అందరినీ తన ప్రదర్శనతో నవ్వించనున్నారు.

ఆకట్టుకునేలా స్వాగతగీతం

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మెగాకన్వెన్షన్‌ను పురస్కరించుకుని వడ్డేపల్లి కృష్ణ, జొన్నవిత్తుల రచించిన స్వాగత గీతానికి వందమాతరం శ్రీనివాస్‌ మ్యూజిక్‌ సమకూర్చారు. ముగ్గురు కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ స్వాగతగీతాన్ని దాదాపు 50 మందికిపైగా మహిళలు, చిన్నారులు పాడనున్నారు.

తెలంగాణ కళా ప్రదర్శన రూపకం

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మెగాకన్వెన్షన్‌లో హైలైట్‌గా తెలంగాణ కళా ప్రదర్శన రూపకం నిలవనున్నది. తెలంగాలోని ప్రముఖ కళలను ఇందులో ప్రదర్శించనున్నారు. లంబడా, గుస్సాడి, థింసా, పేరిణి, బుర్రకథలు ఇతర కళా రూపాలతో ఈ తెలంగాణ కళా ప్రదర్శన రూపకం తయారవుతోంది. 

తెలంగాణ వైభవం పేరుతో మరో డ్యాన్స్‌ బ్యాలెట్‌ కూడా ఈ మెగా కన్వెన్షన్‌లో హైలైట్‌ కానున్నది.  తెలంగాణ కవులు, కళాకారులు, పుణ్య క్షేత్రాలు, తెలంగాణ స్వాతంత్య్రసమర యోధులతో ఈ డ్యాన్స్‌ బ్యాలెట్‌ను తయారు చేస్తున్నారు.  జొన్నవిత్తులగారు రాసిన ఈ రచనకు వందేమాతరం  శ్రీనివాస్‌ సంగీతం అందించారు. నలుగురు టీచర్లు దీనికి  కొరియోగ్రఫీ చేస్తున్నారు. 60,69 మంది డ్యాన్స్‌ బాలె చేస్తున్నారు.

తెలంగాణ వైభవం చాటేలా స్వాగత తోరణాలు

ఈ మెగాకన్వెన్షన్‌కు వచ్చేవారికి తెలంగాణలో ఉన్న అనుభూతిని కలిగించేలా తెలంగాణలోని ప్రముక కట్టడాలతో తోరణాలను ఏర్పాటు చేస్తున్నారు. చార్మినార్‌, సమ్మక్క, సారక్క, తెలంగాణ తల్లి, కాకతీయ తోరణం వంటివి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎస్‌పిబి, సిరివెన్నెల, ట్రిబ్యూట్‌ పేరుతో ఓ కార్యకమం కూడా ఏర్పాటు చేస్తున్నారు.

పొలిటిటకల్‌ ఫోరం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు. ధర్మపురి అరవింద్‌, రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి, డికె అరుణ వంటి వారు పాల్గొంటున్నారని సమాచారం.

టిటిఎ మెగాకన్వెన్షన్‌కు ఇతర సంఘాల మద్దతు

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌కు తమవంతు సహకారాన్ని అందించేందుకు ఇతర తెలుగు సంఘాలు ముందుకు వచ్చాయి. టిటిఎ నాయకులు న్యూజెర్సిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తానా, ఆటా, నాటా, నాట్స్‌, న్యూజెర్సి తెలుగు అసోసియేషన్‌, టిఫాస్‌, జెర్సి తెలుగు అసోసియేషన్‌లకు చెందిన నాయకులు పాల్గొని తమవంతు సహకారాన్ని అందిస్తామని హామి ఇచ్చారు. న్యూజెర్సి తెలుగు ప్రముఖులు ఉపేంద్ర చివుకుల, సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శంకరమంచి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని టిటిఎ మెగా కన్వెన్షన్‌ విజయవంతమయ్యేలా తమ వంతు కృషి చేస్తామన్నారు.

 

Tags :