శ్రీరామనగరాన్ని దర్శించిన జగద్గురు గోవిందగిరి మహారాజ్
హైందవ జాతి అంధకారంలో ఉన్న సమయంలో సమతామూర్తిని నెలకొల్పి జాతిలో నూతనోత్తేజాన్ని నింపి, సువర్ణయుగానికి దారి చూపేందుకు శ్రీరామానుజాచార్యులు అవతరించాడని జగద్గురు గోవిందగిరి మహారాజ్ అన్నారు. సమతామూర్తి దివ్యక్షేత్రాన్ని రాజస్థాన్ పుష్కర్ నుంచి విచ్చేసిన జగద్గురు రామచంద్రాచార్య స్వామిజీ మహారాజ్, బీహార్ నుంచి విచ్చేసిన జగద్గురు శ్రీ స్వామి వెంకటేశ ప్రపన్నాచార్యు జీ మహరాజ్‌తో కలిసి దివ్యక్షేత్రాన్ని దర్శించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన 108 దివ్యక్షేత్రాలు, ఆళ్వార్లు, 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని తిలకించారు. ఈ సందర్భంగా గోవిందగిరి మహారాజ్ మాట్లాడుతూ భాగ్యనగరంలో భగవాన్ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టించి, సువర్ణయుగానికి మార్గదర్శనం చేశారని అభివర్ణించారు. త్రిదండి చినజీయర్ స్వామి భావితరాలకు ఆదర్శనీయుడని కొనియాడారు. అనంతరం ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సీటీ వైస్ చాన్స్‌లర్ డా.జగన్నాథన్ పట్నాయక్, మాజీ డీజీపీ అరవింద్‌రావు తదితరులు కూడా మాట్లాడారు.