భారత సంస్కృతికి చిహ్నమే రామానుజ విగ్రహం- పవన్‌కల్యాణ్
హైదరాబాద్‌లోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ హీరో పవన్‌కల్యాణ్ పాల్గొని, భిన్నమతాలు, భాషలకు మన సంస్కృతికి చిహ్నంగా రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహం నిలుస్తోందని అన్నారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి దర్శించారు. ఈ సందర్బంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ నీ దైవాన్ని ఆరాధించు, ఎదుటి మతాన్ని గౌరవించు అన్న సంప్రాదాయం, సంస్కృతి ఒక్క హిందుజాతిలోనే ఉందని అన్నారు. విప్లవ గురువుగా చిన జీయర్ స్వామిజీ కన్పిస్తున్నారని అభివర్ణించారు. అణగారిని కులాలకు అండగా ఉంటూ సమతాస్ఫూర్తిని చాటుతూ అందరినీ ఒకేలా చూడటం రామానుజాచార్యులకే దక్కిందన్నారు.
Tags :