ASBL Koncept Ambience

ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టొదు

ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టొదు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వేలు పెట్టవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బహుజన జనసేన యుద్దభేరి బహిరంగ సభను ఎల్‌బీస్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వైషమ్యాలు ఉంటే మీ ఇద్దరు తేల్చుకోవాలేగానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని ఆయన అన్నారు. మీ ఇద్దరు ఒకరి కొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకుంటే తమకు అభ్యంతరం లేదని, కానీ ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని ఆయన అన్నారు.

 

Tags :