ASBL Koncept Ambience

తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ గా జే తాళ్ళూరి ఎన్నిక

తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ గా జే తాళ్ళూరి ఎన్నిక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 2017 ఎన్నికల బ్యాలెట్ల కౌంటింగ్‌ను వాషింగ్టన్‌లోని హయత్‌ రీజెన్సిలో నిర్వహించారు. ఈ కౌంటింగ్‌లో తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా జే తాళ్ళూరికి మెజారిటీ లభించడంతో ఆయన గెలిచినట్లు ప్రకటించారు. పోలైన ఓట్లలో కొన్ని ఓట్లు చెల్లకపోవడంతో మిగిలిన 17,590 ఓట్లలో 13,609 ఓట్లను జే తాళ్ళూరి కైవసం చేసుకున్నారు. దాంతో తన ప్రత్యర్థి శ్రీనివాస గోగినేనిపై ఆయన అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. నేను అనుకుంటే ఒక అడుగు- మన అనుకుంటే ముందడుగు అన్న నినాదంతో ఆయన తానా ఎన్నికల బరిలోకి దిగారు. చివరకు తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ పదవిని కైవసం చేసుకున్నాడు. ఆయన విజయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

 

Tags :