ASBL Koncept Ambience

యార్లగడ్డను సన్మానించిన జే తాళ్ళూరి

యార్లగడ్డను సన్మానించిన జే తాళ్ళూరి

ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమితులైన పద్మభూషణ్‌ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఘనంగా సత్కరించింది. న్యూయార్క్‌లోని బీంజ్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌లో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సేవలను కొనియాడుతూ, భాషకు ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పదవి లభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన న్యూయార్క్‌ తానా టీమ్‌ను ఆయన అభినందించారు.

 

Tags :