ASBL Koncept Ambience

తిరువూరులో డిజిటల్ తరగతి గది ప్రారంభం

తిరువూరులో డిజిటల్ తరగతి గది ప్రారంభం

అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి ఆధ్వర్యంలో ఎపి జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతి గదులను ఎన్నారైల సహకారంతో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొలంబస్‌లో ఉన్న ఎన్నారై, కొలంబస్‌ తెలుగు సంఘం మాజీ అధ్యక్షుడు రవి సామినేని విరాళంతో సమకూర్చిన డిజిటల్‌ తరగతిగదిని కృష్ణా జిల్లా తిరువూరులోని జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో ప్రారంభించారు. తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ తాళ్లూరి జయశేఖర్‌ ఈ తరగతి గదిని ప్రారంభించారు. జయరామ్‌ కోమటి పిలుపుకు స్పందించి తిరువూరులో దీన్ని ఏర్పాటుకు విరాళమందించినట్లు రవి సామినేని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ కిలారు విజయబిందు, ఎంపీపీ గద్దె వెంకన్న, మాజీ తహశీల్దార్‌ పొట్లూరి తిరుమలరావు, రవి కుటుంబ సభ్యులు, హైస్కూల్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :