ASBL Koncept Ambience

కృష్ణా కలెక్టర్‌ను కలిసిన జయరాం కోమటి

కృష్ణా కలెక్టర్‌ను కలిసిన జయరాం కోమటి

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతంను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎపి జన్మభూమి తరపున కృష్ణా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను ఆయనకు వివరించారు. ఇప్పటికే దాదాపు జిల్లాకు సంబంధించి ఎన్నారైల సహకారంతో 70 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇతర పాఠశాలల్లో ఈ సంవత్సరం చివరిలోగా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేశారు. 10 అంగన్‌వాడీ కేంద్రాల భవనాలను కూడా చేపట్టనున్నట్లు జయరామ్‌ కోమటి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎపి జన్మభూమి సిబ్బంది, ప్రసాద్‌ గారపాటి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :