ASBL Koncept Ambience

జంపాల చౌదరి ఇంట్లో జయరామ్ కు అభినందన వేడుక

జంపాల చౌదరి ఇంట్లో జయరామ్ కు అభినందన వేడుక

ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన తరువాత జయరామ్‌ కోమటికి అమెరికా అంతతా అభినందన సత్కారాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చికాగోలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జంపాల చౌదరి ఇంట్లో జరిగిన జయరామ్‌ కోమటి అభినందన వేడుకల్లో తానా నాయకులు పలువురు పాల్గొన్నారు. చికాగోకు వచ్చిన జయరామ్‌ కోమటికి తెలుగు కమ్యూనిటీనాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

జంపాల చౌదరి ఇంట్లో జరిగిన అభినందన వేడుకకు తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన, తానా మాజీ అధ్యక్షుడు గంగాధర్‌ నాదెళ్ళ, అశోక్‌బాబు కొల్లా, రజని ఆకురాతి, శ్రీధర్‌ ఎర్రంసెట్టి, మంజులత కన్నెగంటి, అరుణ జంపాల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంపాల చౌదరి మాట్లాడుతూ, తానా అధ్యక్షునిగా పనిచేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున పనిచేసే అవకాశం జయరామ్‌ కోమటికి లభించడం ఆనందంగా ఉందని అన్నారు. జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, అమెరికా తెలుగు కమ్యూనిటీ నాయకుల ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఎన్నారైలను ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తానని చెప్పారు.


Click here for Event Gallery

 

Tags :