ASBL Koncept Ambience

డిట్రాయిట్ లో జయరామ్ కోమటికి ఘన స్వాగతం

డిట్రాయిట్ లో జయరామ్ కోమటికి ఘన స్వాగతం

డిట్రాయిట్‌లోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యాలయాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, కమ్యూనిటీ నాయకుడు జయరామ్‌ కోమటికి ఘన స్వాగతం లభించింది. ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన తరువాత డిట్రాయిట్‌ వచ్చిన జయరామ్‌ కోమటికి స్థానిక తెలుగు ప్రముఖులు ఘనంగా ఆహ్వానించారు. తానా కార్యాలయాన్ని సందర్శించిన తరువాత, స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో జయరామ్‌ కోమటి పాల్గొన్నారు. ఆయనతోపాటు తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన, మాజీ అధ్యక్షుడు గంగాధర్‌ నాదెళ్ళ తదిరులు కూడా తానా కార్యాలయాన్ని సందర్శించారు. 

 

Tags :