ASBL Koncept Ambience

కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన జయరామ్ కోమటి, కోడెల

కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన జయరామ్ కోమటి, కోడెల

విద్యాపరంగా వెనుకబడిన సత్తెనపల్లిని అభివృద్ధి బాటలో నడిపించేందుకు అధ్యాపకులు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పిలుపు నిచ్చారు. స్థానిక పాత ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాల్లో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. తరగతులను లాంఛనంగా ప్రారంభించి, అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో, అధ్యాపకులతో ఆయన చర్చలు జరిపారు. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు డాక్టర్‌ కోడెల శివరామ్‌, ప్రవాసాంద్రులు కోమటి జయరామ్‌, అద్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

వివిధ చోట్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

పట్టణాలకు ధీటుగా గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పిలుపు నిచ్చారు. ఆయన మండంలోని రెడ్డిగూడెం, గణపవరం, ఇనిమెట్ల గ్రామాల్లో ప్రవాసాంధ్రులతో కలిసి పర్యటించారు. అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

గణపవరంలో...

గ్రామంలో నిర్మించ తలపెట్టిన వేణగోపాల స్వామి వారి దేవాలయానికి కోడెల శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం హర్షణీయమన్నారు.

ఇనిమెట్లలో... నూతనగా నిర్మించిన పంచాయితీ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రవాసాంధ్రల సహకారంతో స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూలులో డిజిటల్‌ తరగతులు మంజురు కాగా, వాటిని, ప్రారంభించారు. ఎస్సీకాలనీలో సుమారు 30 లక్షలతో నిర్మించనునన సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. కాగా ప్రవాసాంధ్రులు కొండ్రకుంట చలపతి, కోమటి జయరామ్‌ కోమటి, కోడెల శివప్రసాద్‌ను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.

ఆయా కార్యక్రమాల్లో యువ నాయకులు డాక్టర్‌ కోడెల శివరామ్‌, ఎన్‌ఆర్‌ఐలు, ఎంపిపి సర్రా సంధ్యారాణి, జెడ్‌పిటిసి సభ్యులు మర్రి వెంకట్రామిరెడ్డి, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ నర్రా బాబురావు, యార్డు చైర్మన్‌ పూజల చినవెంకటకోటయ్య, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కమిటీ డైరెక్టర్‌ అండాళ్ళ ప్రభుదాసు, మండల టిడిపి అధ్యక్షులు అంచుల నరసింహారావు, గణేసు వెంకట్రావ్‌, కొండ్రకుంట రంగరావు, జిల్లా అధికారులు పులి శ్రీనివాసరావు,  హబీబ్‌భాషా, డిఇ మల్లిఖార్జునరావు, ఎఇలు, ఎంపిడిఓ రాజేష్‌ తహశీల్దార్‌ నగేష్‌, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :