ASBL Koncept Ambience

జయరామ్ కోమటి పిలుపునకు స్పందిస్తున్న ఎన్నారైలు

జయరామ్ కోమటి పిలుపునకు స్పందిస్తున్న ఎన్నారైలు

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి నవాంధ్ర అభివృద్ధికోసం తనవంతుగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా నలుమూలలా జన్మభూమి అభివృద్ధికి కలసిరావాలంటూ ఆయన నిర్వహిస్తున్న సమావేశాలకు మంచి స్పందన వస్తోంది. న్యూజెర్సిలో మార్చి 27వ తేదీన జరిగిన కార్యక్రమానికి ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి జయరామ్‌ మాట్లాడుతూ, జన్మభూమి రుణం తీర్చుకోవడానికి తగిన సమయం వచ్చిందన్నారు. నవ్యాంధ్ర రాజధానిని ప్రపంచంలోనే అతి గొప్ప నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయన కృషిలో మనం కూడా పాలుపంచుకుని మన రాజధాని నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సహజవనరులను, మానవ నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ముందుకు రావాలన్నారు. పలువురు ఎన్నారైలు నవ్యాంధ్ర అభివృద్ధికి తమవంతుగా కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తానా  నాయకుడు సతీష్‌ వేమన, రవి పొట్లూరి, జై తాళ్ళూరి, వాసుదేవ రెడ్డి చిన్నా, హరీష్‌ కోయా, రావు యలమంచిలి, బ్రహ్మాజీ వలివేటి, దాము గెదెలతోపాటు లక్ష్మీదేవినేని తదితరులు పాల్గొన్నారు.

 

Tags :