రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబును గెలిపించాలి - జయరామ్ కోమటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, చంద్రబాబు గెలుపు కోసం ఎన్నారైలు ఎంతోమంది కృషి చేస్తున్నారని ఎన్నారై తెలుగుదేశం పార్టీ నాయకుడు జయరామ్ కోమటి అన్నారు. రేపల్లెలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు మద్దతుగా జయరామ్ కోమటి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం?పార్టీ గెలుపుకోసం అమెరికా నుంచి 600 మంది ఎన్నారైలు ఇక్కడకు వచ్చి ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
నవ్యాంధ్ర త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాథ్యమవుతుంద న్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే తప్పనిసరిగా టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. తీరప్రాంతం రేపల్లే నియోజకవర్గంలో గత ఐదు దశాబ్దాలుగా జరగని అభివృద్ధిని ఐదేళ్లలో అనగాని చేసి చూపించారన్నారు. జిల్లాలోనే వెనుకబడిన నియోజకరవ్గమైన రేపల్లే ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల నిధులు ఇచ్చి అభివృద్ధి చేశారని, దొంగల పార్టీలకు ఓట్లు వేస్తే రాష్ట్ర భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి అభివృద్ధి చేసే నాయకుడైన చంద్రబాబుకు, అనగానికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నారై టీడిపి సభ్యులు ప్రచారం చేయటం సంతోషంగా ఉందని తెలిపారు. సమావేశంలో ఎన్నారై చింతమనేని సుధీర్, పంతాని మురళీధర్, అవగాని శివప్రసాద్ పాల్గొన్నారు.