ASBL Koncept Ambience

బాబు పర్యటన పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన జయరామ్‌ కోమటి

బాబు పర్యటన పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన జయరామ్‌ కోమటి

కాలిఫోర్నియాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను పురస్కరించుకుని అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఎన్నారై టీడిపి రూపొందించిన పోస్టర్‌ను మిల్‌పిటాస్‌లో జరిగిన సమావేశంలో రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవ్యాంధ్రప్రదేశ్‌ను అన్నీ విధాలా అభివృద్ధిపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు కూడా పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి అభిలషిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే ఎపిఎన్‌ఆర్‌టీ, ఎపి జన్మభూమి సంస్థలను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని తెలిపారు. ఎన్నారై టీడిపి, ఎపి జన్మభూమి, ఎపిఎన్‌ఆర్‌టీ సంయుక్తంగా మే 7వ తేదీన శాన్‌హోసెలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసెప్షన్‌కు అందరూ హాజరుకావాలని ఆయన కోరారు.

మే 7వ తేదీ ఆదివారం రాత్రి 7 నుంచి 10 వరకు శాన్‌హోసెలోని ఈవెంట్‌ సెంటర్‌లో ఈ  కమ్యూనిటీ రిసెప్షన్‌ జరుగుతోంది.

ఈ కార్యక్రమంలో వెంకట్‌ కోగంటి, విజయ ఆసూరి, భక్తబల్లా, రజనీకాంత్‌ కాకర్ల, రామ్‌ తోట, పైలా ప్రసాద తదితరులు పాల్గొన్నారు.

 

Tags :