ASBL Koncept Ambience

బీజేపీ గూటికి జితేందర్ రెడ్డి

బీజేపీ గూటికి జితేందర్ రెడ్డి

టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఢిల్లీలో జితేందర్‌రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన పార్టీలో చేరడంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ కీలకపాత్ర పోషించారు. బీజేపీలో చేరడం మాతృసంస్థలోకి వచ్చినట్లుందని జితేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. లోక్‌సభకు పోటీచేసే అవకాశం ఎందుకు ఇవ్వలేదో టీఆర్‌ఎస్‌ నాయకత్వమే చెప్పాలన్నారు. పదవులు ఆశించో, హామీలు తీసుకునో బీజేపీలో చేరడం లేదన్నారు. నా మీద మెరుపు దాడి ఎందుకు చేశారో అర్థం కాలేదు. ఈ నెల 21న నా పేరు జాబితాలో లేనప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌ నుంచి ఫోన్‌ లేదు. పుట్టినరోజునాడు పలకరించిన కేసీఆర్‌.. పార్టీ వీడుతున్న సమయంలో ఒక్కఫోన్‌ కూడా చేయలేదు. బీజేపీలో మంచి స్థానం ఉంటుందని అమిత్‌ షా హామీ ఇచ్చారు అని జితేందర్‌ రెడ్డ తెలిపారు. 1999లో బీజేపీ తరపున జితేందర్‌ రెడ్డి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో టీఆర్‌ఎస్‌ తరపున మహబూబ్‌నగర్‌ నుంచి ఎన్నికై ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేతగా వ్యవహరించారు.

 

Tags :