ASBL Koncept Ambience

దుర్గామాత ఆశీస్సుల కోసం బారులు తీరిన భక్తులు

దుర్గామాత ఆశీస్సుల కోసం బారులు తీరిన భక్తులు

గ్రేటర్‌ అట్లాంటాలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో మే13, 14 తేదీల్లో జరిగిన విజయవాడ కనక దుర్గ  అమ్మవారి కుంకుమార్చన పూజలకు భక్తులు బారులు తీరారు. ఈ కార్యక్రమానికి మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) పూర్తి సహకారాన్ని అందించడంతోపాటు కో స్పాన్సర్‌గా కూడా వ్యవహరించింది. విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పూజారులు శంకర శాండిల్య, లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, శంకరమంచి ప్రసాద్‌, గోపాలకృష్ణలతోపాటు విజయవాడ ఆలయ పిఆర్‌ఓ అచ్చుతరామయ్య, ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగేలా చూశారు. భక్తుల చేత శాస్త్రోక్తంగా అమ్మవారి కుంకుమార్చనలతోపాటు, త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్రనామ పారాయణం వంటివి చేయించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రసాదంతోపాటు డాలర్‌, శేషవస్త్రాలను బహూకరించారు. 


Click here for Event Gallery

 

Tags :