ASBL Koncept Ambience

శాక్రమెంటోలో మే 15న విజయవాడ కనకదుర్గ పూజలు

శాక్రమెంటోలో మే 15న విజయవాడ కనకదుర్గ పూజలు

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో 'తెలుగు టైమ్స్‌', 'పాఠశాల' నిర్వహిస్తున్న విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి కుంకుమార్చనలు మే 15, 16న శాక్రమెంటోలోని లక్ష్మీనారాయణ టెంపుల్‌లో నిర్వహిస్తున్నట్లు ఈ వేడుకలకు కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. ఇప్పటికే మిల్‌పిటాస్‌, సియాటెల్‌, పోర్ట్‌లాండ్‌ తదితర నగరాల్లో అమ్మవారి కుంకుమార్చనల పూజలు దిగ్విజయంగా జరిగినట్లు ఆయన చెప్పారు.

మే 15, 16న ఇక్కడి భక్తుల కోసం శాక్రమెంటోలో కూడా నిర్వహిస్తున్నామని, విజయవాడలోని అమ్మవారి గుడి నుంచి వచ్చిన ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా భక్తుల చేత త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్ర కుంకుమార్చన పూజలు చేయిస్తారని ఆయన చెప్పారు. విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శ్రీ చక్ర పీఠంతోపాటు భక్తులు పూజ చేసేందుకు వీలుగా గోల్డ్‌ కోటెడ్‌ శ్రీ చక్ర రాగి యంత్రాలను కూడా తెచ్చామని, పూజల్లో పాల్గొన్న భక్తులకు అమ్మవారి పసుపు కుంకుమలతోపాటు అమ్మవారి కంకణం, డాలర్‌ను కూడా ఇస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇతర వివరాలకు ఆలయ నిర్వాహకులను కాని, వెంకట్‌ మేచినేని (ఫోన్‌ నెం.916 243 8049), వెంకట్‌ బుక్కా (ఫోన్‌ నెం.718 753 9327)ను కాని సంప్రదించవచ్చు.

 

Tags :