విజయవాడ నుంచి వస్తున్న ప్రధాన అర్చకుల బృందం
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ, విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలోని 10 నగరాల్లో కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజలను నిర్వహించేందుకు విజయవాడలోని అమ్మవారి దేవాలయం ప్రధాన అర్చకులతో కూడిన బృందం ఒకటి అమెరికా బయలుదేరుతున్నది. విజయవాడ నుంచి వస్తున్న బృందంలో లింగంభొట్ల దుర్గా ప్రసాద్, శంకర శాండిల్య, కోట ప్రసాద్, శంకరమంచి ప్రసాద్, గోపాలకృష్ణలతోపాటు పీఆర్‌ఓ అచ్చుతరామయ్య వస్తున్నట్లు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ తెaలిపారు. ఏప్రిల్ 22 నుంచి అమెరికాలో కనకదుర్గ అమ్మవారి పూజలు వైభవంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Tags :