విజయవాడ కనకదుర్గమ్మ పూజలకు న్యూజెర్సి రెడీ
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో 'తెలుగు టైమ్స్', 'పాఠశాల', ధనలక్ష్మీ ట్రస్ట్ న్యూజెర్సిలో మే 6,7 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ కనదుర్గ కుంకుమార్చనల పూజలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ఈ వేడుకకోసం స్థానిక తెలుగు ప్రముఖుడు కంప్యూగ్రా అధినేత రామ్ మోహన్ వేదాంతం ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పడి పూజలకు అవసరమైన ఏర్పాట్లను చేసింది. మరోవైపు భానుప్రసాద్ దివాకర్ల టీమ్ కూడా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కృషి చేస్తోంది. కుంకుమార్చనల్లో పాల్గొనే భక్తులకు అవసరమైన పసుపు, కుంకుమలను తెప్పించారు.
విజయవాడ నుంచి వచ్చిన అమ్మవారి అర్చకులు కూడా న్యూజెర్సికి చేరుకున్నారు. న్యూజెర్సిలోని శ్రీ స్వామినారాయణ్ టెంపుల్‌లో ఈ పూజలు జరగనున్నది. మే 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు, మే 7వ తేదీ శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు పూజలను ఏర్పాటు చేశారు. పూజల తరువాత వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. విజయవాడ నుంచి వచ్చిన అర్చకులు భక్తుల చేత శాస్త్రోక్తంగా త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్ర కుంకుమార్చన చేయనున్నారు.
ఇతర వివరాలకు రామ్ వేదాంతం ను 732 543 4655లో సంప్రదించవచ్చు.