ASBL Koncept Ambience

తానా సభల్లో కపిల్ దేవ్

తానా సభల్లో కపిల్ దేవ్

వాషింగ్టన్‌డీసీలో జరుగుతున్న తానా 22వ మహాసభల్లో భారత క్రికెట్‌ జట్టు మాజీ సారధి, ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు కపిల్‌దేవ్‌ సందడి చేశారు. కపిల్‌దేవ్‌ మహాసభల ప్రాంతానికి వచ్చినప్పుడు పలువురు క్రికెట్‌ అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. తానా నాయకులు ఆయనను వేదికపైకి ఆహ్వానించి ప్రసంగించాలని కోరారు. వేదికపైకి కరత్వాళ ధ్వనులతో ఆయనను ఆహ్వానించారు. కపిల్‌ దేవ్‌ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, తెలుగులో  నమస్కారం అంటూ చెప్పడంతో ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగింది. ఈ సభలు విజయవంతం కావాలని, తెలుగువారి మధ్య ఇలా సరదాగా గడపడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

 

Tags :