కరోనా రక్షణ మాస్క్ ల తయారీలో కప్పట్రాళ్ళ మహిళలు బిజీ
ఆంధప్రదేశ్‍లోని కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన మహిళలు కరోనా వైరస్ బారి నుంచి రక్షణకు అవసరమైన మాస్క్ ల తయారీని చేపట్టారు. ప్రభుత్వం నిర్దేశించిన గైడ్‍లైన్స్ ను అనుసరించి మాస్క్లను మహిళలు తయారు చేస్తున్నారు. లాక్ డౌన్ పిరియడ్‍ను సద్వినియోగం చేసుకుంటూ ఓవైపు కుటుంబానికి ఆర్థికంగా సహాయ పడుతూ, మరోవైపు కరోనా వైరస్ పై ప్రజలను వారు జాగృతం చేస్తున్నారు. మాస్క్లతో పాటు ఫుడ్ బాస్కెట్స్ ను, హైజిన్ కిట్‍ను కూడా వారు తయారు చేస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధిపరిచిన సంగతి తెలిసిందే. తానా కార్యదర్శి రవి పొట్లూరి ఈ గ్రామాభివృద్ధి కోసం తానా తరపున విశేషంగా కృషి చేస్తున్నారు.
Tags :