ASBL Koncept Ambience

తానా వీల్ చైర్ క్రికెట్ పోటీలో విజేతగా కర్ణాటక జట్టు

తానా వీల్ చైర్ క్రికెట్ పోటీలో విజేతగా కర్ణాటక జట్టు

తానా ఆధ్వర్యంలో గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం క్రికెట్‌ మైదానంలో ఈ నెల 9 నుంచి జరిగిన దివ్యాంగుల దక్షిణ భారత క్రికెట్‌ కప్‌-2022 పోటీలు ముగిసాయి. ఈ పోటీలలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆంధ్ర, కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. పైనల్స్‌లో టైటిల్‌ కోసం కర్ణాటక,  తమిళనాడు జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి 127 పరుగులు చేసింది. సమాధానంగా బ్యాటింగ్‌ ప్రారంభించిన కర్ణాటక జట్టు కేవలం 12.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి విజయాన్ని సాధించింది.

కర్ణాటక జట్టులో యాన్‌ఆల్ట్‌ 10 ఫోర్లుతో 52 పరుగులు చేయగా సాగర్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభను కనబరిచి 49 పరుగులు చేయడంతో పాటు 1 వికెట్‌ను చేజిక్కించుకన్నాడు. సాగర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ దా మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ సందర్భంగా జరిగిన జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభకు గీతం అధ్యక్షుడు ఎమ్‌.శ్రీభరత్‌, డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్‌, తానా ఫౌండేషన్‌ అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, చైర్మన్‌ యార్లగడ్డ వెంకటరమణ, ట్రస్టీ రమి సామినేని, క్రీడా విభాగం కో ఆర్డినేటర్‌  శశాంక్‌ యార్లగడ్డ,  ఆంధ్రప్రదేశ్‌ వీల్‌చైర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎమ్‌.శామ్యూల్‌ బెంజిమన్‌, కార్యదర్శి రామన్‌ సుబ్బారావు, పోటీల నిర్వహక కార్యదర్శి రత్నాకరరావు, గీతం క్రీడా విభాగం డైరెక్టర్‌ కే.అరుణ్‌ కార్తీక్‌ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.

 

Click here for Photogallery

 

 

Tags :