అందరూ రండి... కరుణాకర్ మాధవరం
తెలంగాణ అభిమానులందరికి అమెరికా తెలంగాణ సంఘం తరుపున మా అభివందనములు. ఈ సంస్థ అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న స్థానిక తెలంగాణ సంస్థల ఐక్య సమాఖ్య సంఘటిత శక్తి . అంతటి సంస్థకు ప్రప్రథమ చైర్మన్ గా పనిచేయడం చాల పెద్ద బాధ్యత. అపారమైన నమ్మకంతో ఈ గురుతర బాధ్యతను నాకు అప్పగించిన ధర్మకర్తలమండలికి, సభ్యులకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు నా అభినందనలు. ప్రతి తెలంగాణ వాసి, వాదీ, తెలంగాణ బాగు కోరే వారు ప్రతి ఒక్కరు మా సంస్థ లోకి ఆహ్వానితులే. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రమునకు , అమెరికాలోని తెలంగాణ ప్రవాసులకు వారధి గా ఉంటుంది. మేము చేసే ప్రతి మంచి పనికి మా వెంటే వుండే కార్య కర్తలకు, దాతలకు, మీడియా మిత్రులకు మా శుభాబి వందనములు.
మన దేశానికి వెన్నెముక రైతు. అలాగే మన సంస్కతి, సాంప్రదాయాలకు ప్రతీకలు మన కవులు. ఈ ద్వితీయ ప్రపంచ తెలంగాణా మహాసభలను ప్రతి తెలుగు వాడు, తెలంగాణా వాడు గర్వించ దగ్గ మన తెలంగాణా కవి, అవార్డ్ గ్రహీత స్వర్గీయ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి అంకితమిస్తూ, రైతు ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియ చేస్తూ, రైతే రాజు అన్న నినాదం తో మీ ముందుకు తీసుకు వస్తున్న ఈ మహా సభలకు మీ అందరినీ ఆహ్వానిస్తూ.