కశ్మీరీ పండిట్లతో ప్రధాని నరేంద్ర మోదీ
అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశంలోని హ్యూస్టన్ నగరంలో జరిగే హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మోదీని అక్కడ నివాసముంటున్న కాశ్మీర్ పండిట్లు కలిశారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ అభివృద్ది కోసం ప్రధాని నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 7 లక్షల మంది కాశ్మీర్ పండిట్ల తరపున ధన్యదాదాలు తెలుపుతున్నట్లు వివరించారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందన్నారు. కాశ్మీరీ పండిట్ల తరపున ప్రధానికి వినతి పత్రం సమర్పించామన్నారు. మనందరం నవ కాశ్మీరం నిర్మిద్దామని ప్రధాని మోదీ కాశ్మీరీ పండిట్లతో అన్నారు. సరికొత్త కాశ్మీర్ ఆవిర్భావానికి బాసటగా నిలుస్తామని పండిట్లు అన్నారు. కాశ్మీరీ పండిట్ సురీందర్ కౌల్ మోదీతో భేటీకి సంబంధించిన విషయాలను వెల్లడించారు.
Tags :