ASBL Koncept Ambience

9వ సారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్

9వ సారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధ్యక్షుడిగా సీఎం కె. చంద్రశేఖర్‌ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పార్టీ ప్లీనరీ ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఫలితంగా 9వ సారీ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు శుభాకాంక్షాలు తెలిపారు.

పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 18 సెట్ల నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. పార్టీలోని అన్ని విభాగాలు, అన్ని సామాజికవర్గాల నేతలు కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ నామినేన్లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి ఇతరులెవ్వరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో కేసీఆర్‌ ఎన్నిక ప్రకటన ఏకగ్రైవమైంది.

రెండు దశాబ్దాల ప్రస్థావాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి చేసుకున్న తరుణంలో ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ప్లీనరీ సమావేశానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.  ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ అనేక అపనమ్మకాల మధ్య  ఉద్యమానికి శ్రీకారం జరిగిందని, అనేక అటుపోట్లు ఎదురయ్యాయి అయినా స్పష్టమైన లక్ష్యంతో ముందుకు కదిలామన్నారు. ఎక్కడ కూడా రాజీలేని పోరాటం చేయడం ద్వారానే తెలంగాణను సాధించుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కలాలకు మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో తెలంగాణ పథకాలు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. దేశం కంటే తెలంగాణ రాష్ట్రం ముందుందని తెలిపారు.

Click here for Photogallery

 

Tags :