కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ సంబరాలు
తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఈరోజు గునుగు, తంగేడు, సీతాకుచ్చులతో ఎంగిలి బతుకమ్మను జరుపుకుంటున్నారు. మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక, ఆడబిడ్డల ఆనందాల హరివిల్లు బతుకమ్మ పండుగ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు.
దేవుని ముందర పూలను ఉంచి పూజించే మనం పువ్వులనే దేవుళ్ళుగా భావించి బతుకమ్మ పండుగను జరుపుకునే ఏకైక ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం... ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు కొండంత అండగా నిలుస్తుంది అనడానికి ఈ బతుకమ్మ పండుగయే నిదర్శనం.
ఈ బతుకమ్మ పండుగను మరింత శోభాయ మానంగా... మరింత ఉత్సాహభరితంగా మన మనందరిని భాగస్వామ్యం చేస్తూ తను పాట పాడుతూ మనందరిచే పాడిస్తూ ... తను నృత్యం చేస్తూ మనందరిచే నృత్యం చేయిస్తూ మనందరిని అలరించడానికి తెలంగాణ రాష్ట్రం నుండి ప్రముఖ జానపద కవి గాయకులు విద్యానందాచారి గారు విచ్చేస్తున్నారు.. ఈ కార్యక్రమం కాన్సాస్ సిటీ హిందూ టెంపుల్ కల్చరల్ సెంటర్ లో ఈ ఆదివారం నాడు అనగా అక్టోబర్ 15 వ తేదీ *మద్యాహ్నం మూడుగంటలకు* చాలా గొప్పగా నిర్వహించ తలపెట్టినాం. మీరందరూ విచ్చేసి ఈ మహా బతుకమ్మ సంబురాన్ని అంబరాన్ని తాకేలా కోరుకుంటూ మీ కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు.