హూస్టన్ బోనాల ఉత్సవాల్లో కోడెల
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు హూస్టన్ నగరంలో తెలంగాణ ప్రవాసులు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకునేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఎన్నారై టీడీపీ హూస్టన్ శాఖ, ప్రవాసాంధ్ర సంఘాల నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కొత్త రాష్ట్రంలో పెట్టుబడులకు ఇది మంచి సమయమని ప్రవాసులకు సూచించారు. ప్రత్యేక హోదా విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి సహించరానిదిగా ఉందని అన్నారు. ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ ప్రవాసులు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని, పెద్దసంఖ్యలో పెట్టుబడులతో తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు చలసాని మల్లికార్జునరావు, ముత్యాల పద్మ, కోనేరు అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.