ఎర్ర చీరలో మెరిసిన కృతి
మొదటి సినిమా ఉప్పెన తో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టికి ఆ తర్వాత కూడా ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ వరుస డిజాస్టర్లు అమ్మడికి ఛాన్సులు తగ్గేలా చేశాయి. ప్రస్తుతం కృతి ఫోకస్ మొత్తం తమిళ ఇండస్ట్రీపై ఉంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే కృతి తన ఫ్రీ టైమ్ లో ఫోటో షూట్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా అమ్మడు రెడ్ కలర్ శారీలో మెరిసింది. చీరకట్టులో కృతి ఎంతో అందంగా కనిపించింది. అంతేకాదు ఓర కళ్లతో అమ్మడి నవ్వు కుర్రాళ్ల గుండెల్ని గాయపరుస్తుంది. కృతి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :