లండన్ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్ ఫ్రాంక్ రాయట్‌తో భేటీ అయ్యారు. ఆ కంపెనీ విస్తరణ, తెలంగాణలో ఉన్న అవకాశాలపై చర్చించారు. దీనిపై ఫ్రాంక్ రాయలట్ స్పందిస్తూ ఇప్పటికే హైదరాబాద్‌లో రూ.710 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామనీ, 125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. గడచిన రెండేండ్లలో రూ.340 కోట్లను హైదరాబాద్ ఫార్మాలో పెట్టుబడిగా పెట్టామన్నారు.
థామస్ లాయిడ్ ట్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నందిత సెహగల్ తుల్లీ, పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో మంత్రి సమావేమయ్యారు. రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అభివృద్ధికి సంబంధించిన ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో కలిసి పని చేసేందుకు రియల్ సంస్థ సూత్రపాయం అంగీకారం తెలిపింది. అనంతరం క్రాస్ ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హాల్ఫార్డ్, ప్రో వైస్ ఛాన్స్‌లర్ పోల్లార్డ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏరోనాటికల్ యూనివర్సిటీపై చర్చించారు. హెచ్‌ఎస్‌బీసీ ప్రతినిధులు పాల్ మెక్ పియార్సన్, బ్రాడ్‌హిల్ బర్న్‌లు మంత్రితో సమావేశమయ్యారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, త్వరలో దీనికి సంబంధించి స్పష్టమైన కార్యాచరణతో మరోసారి సమావేశమవుతామని తెలిపారు.