మంత్రి కేటీఆర్‌తో గూగుల్ సీఈవో భేటీ
గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ దావోస్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో గూగుల్ సేవల విస్తరణ గురించి చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం 2020ని కృత్రిమ మేధ నామ సంవత్సరంగా ప్రకటించడం పట్ల సుందర్ పిచాయ్ కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. తెలంగాణ అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగం విస్తరణకు గూగుల్ సహకరించాలని కేటీఆర్ కోరారు. ప్రముఖ పారిశ్రామిక సంస్థల అధిపతులు కూడా కేటీఆర్‌ను కలిసి, తెలంగాణలో పెట్టుబడుల గురించి చర్చించారు.
జపాన్‌కు చెందిన టాకెడా సంస్థ టీకాల వాణిజ్య విభాగం అధ్యక్షుడు రాజీవ్ వెంకయ్య ఔషధ నగరిలో పెట్టుబడుల గురించి మాట్లాడారు. ప్రముక ఆటొమేషన్ సంస్థ రాక్‌వెల్ చైర్మన్, సీఈవో బ్లేక్ డిమోరెట్‌తో ఆటోమేషన్ విస్తరణపై చర్చించారు. బీఏఈ సిస్టమ్‌స్పిక్ చైర్మన్ రోజల్ కార్, కేపీ ఎంజీ చైర్మన్, సీఈవో బిల్ థామస్‌తో వైమానిక రంగం గురించి మాట్లాడారు. హెచ్‌సీఎల్ టెక్ సీటీవో కల్యాణ్‌కుమార్, ఐడియో సీఈవో శాండి స్పైచర్, మహీంద్రా-మహీంద్రా సంస్థ ఎండీ పవన్ కె గోయంకాలు కూడా కేటీఆర్‌తో సమావేశమయ్యారు.