ASBL Koncept Ambience

లాస్ ఏంజిల్స్ లో ఘనంగా లాటా సంక్రాంతి సంబరాలు

లాస్ ఏంజిల్స్ లో ఘనంగా లాటా సంక్రాంతి సంబరాలు

శనివారం జనవరి 19, 2019, లాస్‌ ఏంజిల్స్‌ మహా నగరం లో లాటా వారు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపబడివని. నగరం నలుమూలల నుండి విచ్చేసిన తెలుగు వారికి చిన్న నాటి సంక్రాంతి తీపి గురుతులు జ్ఞాపకం వచ్చే విధంగా, ఉత్సావ వాతావరణం లో జరుపుకోవటం జరిగింది. ఇండియా నుండి వచ్చిన పెద్దవారు ఇక్కడ మనం ఇంత చక్కగా తెలుగు సంస్కృతిని కాపాడుకోవటం చూసి అబ్బురపడ్డారు.

దాదాపు 2800 మంది పాల్గొన్న ఈ వేడుకల్లో, 345 మంది పిల్లలు, పెద్ద వాళ్ళు ప్రదర్శనలు చేశారు. దాదాపు 160 మంది స్వచ్ఛంద సేవకులు పనిచేసి పెద్ద పండుగ వాతావరణం తీసుకువచ్చారు. సంబరాలు మధ్యాహన్నం పంక్తి భోజనం తో మొదలయ్యి, రాత్రి 10 గంటల వరకు జరిగినవి. ముందుగా శారద నందూరి బయట వేదికకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లాటా వాలంటీర్స్‌ చేసిన చెక్క భజనలు, కోలాటాలు బయటి ప్రాంగణాన్ని హోరెతించాయి. సతీష్‌ నందూరి సంప్రదాయ దుస్తుల పోటీలలో విశేషంగా 130 మంది పాల్గొని అతిధులను ఆట్టుకున్నారు. ఉచిత ఇమ్మిగ్రేషన్‌ కేంద్రం, ఆరోగ్య పరీక్షా కేంద్రం, వివిధ బట్టలు మరియు నగలు స్టాల్ల్స్‌, తిరునాళ్ళను గుర్తు తెచ్చే పిల్లల ఆటలు, గోరింటాకు, పేస్‌-పెయింటింగ్‌ మొదలగు కార్యక్రమాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. లాటా మహిళా వాలంటీర్స్‌ రంగురంగులతో అద్భుతముగా చక్కదిద్దిన మీడియా పాయింట్‌ ముందు వచ్చిన అతిథులు కుటుంబ సమేతముగా ఫోటోస్‌ తీసుకున్నారు. అమెరికాలో మొట్టమొదటి సారి పులి వేషం వేసి లాటా వారు ఔరా అనిపించారు. దానికి కోలాటం, డప్పు ప్రదర్శనలు తోడు అవ్వటంతో సాంక్రాంతి మేళ హోరందుకుంది.

సాయంత్రం భజనల తర్వాత, శ్రీమతి రాధా శర్మ, శ్రీ విఎస్‌ఎన్‌ శర్మ దంపతులు జ్యోతి ప్రజ్వలనతో ఆడిటోరియం లోపలి ప్రదర్శనలని ప్రారంభించారు. శ్రీమతి శ్వేతా కాకరాల, చక్కటి విద్యార్థునిలతో కలసి వ్యాఖ్యాతలుగా వ్యవహరించటం అలరించింది. పిల్లలు, పెద్దలు అని లేకుండా నెలలు తరబడి కృషితో అధ్యయనం చేసిన నృత్యాలని, పాటలని, నాటకాలని అత్యద్భుతంగా ప్రదర్శించి అందరికి కనుల పండుగ చేసారు. సంక్రాంతి సందర్భముగా లాటా వారు ఆరు చోట్ల ముగ్గులు, వంటల పోటీలని నిర్వహించారు. వాటికి బహుమతులు ప్రఖ్యాత సినిమా హీరోయిన్‌ లయ గారు అందించారు. వచ్చిన అతిథులు ఇలా స్థానికులకు పెద్ద పీట వేసినందుకు లాటా వారికి కృతజ్ఞతలను తెలిపారు.

గత ఐదు సంత్సరాలుగా వందలాది పిల్లలకు నృత్యం నేర్పించి, లాటా కార్యక్రమాలకి స్వచ్ఛంద సేవ చేసిన నవీన్‌ కాంత్‌ భాయి కి లాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ జ్ఞాపిక ఇచ్చి  సత్కరించారు. మధ్యాహ్నం భోజనాలు అందించిన ణశీఝ ూశ్రీaషవ, ుబర్‌ఱఅ వారికి, సాయంత్రం భోజనాలు అందించిన +శీసaఙaతీఱ  =వర్‌aబతీaఅ్‌ వారికి, సంపూర్ణ సంక్రాంతి భోజనం అందించినందుకు లాటా మనసారా ధన్యవాదాలు తెలిపారు. నిరంతరము కృషిచేస్తున్న వాలంటీర్స్‌ లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చెయ్యటం వీలుపడదు అని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన అతిధులకి, ప్రదర్శనలు ఇచ్చిన వారికి, వారి తల్లిదండ్రులకి, దాతలకు, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి సంబరాలు బారతదేశము మరియు అమెరికా జాతీయ గీతాలతో ముగిసినవి.

Click here for Event Gallery

 

Tags :