ASBL Koncept Ambience

నాటా సాహిత్య కార్యక్రమాలు

నాటా సాహిత్య కార్యక్రమాలు

ఐదు విశిష్ట సాహితీ ప్రక్రియల అపూర్వ సంగమం

డల్లాస్‌లో జూన్‌ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే నాటా మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు సాహిత్య కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. తెలుగు భాష-సాహిత్యం పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అవధానం, నాటకం, పద్యం, సినిమా, జానపదంతో అపూర్వ సంగమంగా సాహిత్య కార్యక్రమాలు అలరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బులుసు అపర్ణ - అవధానం, డాక్టర్‌ నరాల రామారెడ్డి - పద్యం, డాక్టర్‌ ఆకేళ్ళ బాలభాను - పద్యం, బాలాంత్ప్రస్త్ర వెంకటరమణ - పద్యం, రామ్‌ గోపాల్‌వర్మ - సినిమా, రాజ్‌ రాచకొండ - సినిమా, అనంత్‌ శ్రీరామ్‌ - సినిమా, బలభద్రపాత్రుని రమణి - సినిమా, మాడిశెట్టి గోపాల్‌ - జానపదం, మాట్ల తిరుపతి - జానపదం, డాక్టర్‌ రామడుగు నరసింహాచార్యులు - జానపదం, డాక్టర్‌ కందిమళ్ళ సాంబశివరావు - నాటకం, వాడ్రేవు సుందర్రావు - నాటకం, డాక్టర్‌ మీగడ రామలింగస్వామి - నాటకం పాల్గొంటున్నారు.

 

 

Tags :