ఆటా సాహిత్య కార్యక్రమాలు
చికాగోలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఆటా కాన్ఫరెన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాహిత్య కార్యక్రమాల్లో ఎంతోమంది సాహితీవేత్తలు పాల్గొంటున్నారు. కవులు అఫ్సర్, అట్టాడ అప్పల నాయుడు, దేశపతి శ్రీనివాస్, అప్పిరెడ్డి హరినాథ రెడ్డి, కొండవీటి సత్యవతి, వేలూరి వెంకటేశ్వరరావు, రెంటాల కల్పన, కొమరవోలు సరోజ, ప్రభల జానకి, నారాయణ స్వామి వెంకటయోగి, గోరేటి వెంకన్న, నారాయణ స్వామి శంకగిరి, అమరేంద్ర దాసరిలను ఈ మహాసభలకు సాహిత్య కమిటీ ఆహ్వానించింది. ప్రముఖ అవధాని నరాల రామారెడ్డి చేత అవధాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. సినీ రచయితలు చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, అందెశ్రీ చేత వినూత్న కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. వీటితోపాటు పుస్తక ఆవిష్కరణ, స్వీయ కవితాపఠనం వంటి ఎన్నో కార్యక్రమాలను ఈ సాహితీ కార్యక్రమాల్లో చూడవచ్చని సాహిత్య కమిటీ పేర్కొంది.
Tags :