అమరావతిలో "లండన్ ఐ"
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో లండన్ ఐ తరహా నూతన పర్యాటక కేంద్రం అభివృద్ధికి గల అవకాశాలపై పరిశీలించనున్నట్లు తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చంద్రబాబు బృందం లండన్ పర్యటనలో తొలిరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లండన్‌కు చేరుకోగానే థేమ్స్ నది పక్కన ఆకర్షణీయ పర్యాటక స్థలం లండన్ ఐ ని చంద్రబాబు బృందం సందర్శించింది. రాజధాని అమరావతిలో లండన్ ఐ తరహా పర్యాటక ఆకర్షక కేంద్రం ఏర్పాటుపై పరిశీలించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం అక్కడి వాణిజ్య, వ్యాపారవేత్తలతో సమావేశయ్యేందుకు తూర్పు లండన్‌లోని కెనరీ వార్స్‌లో ఉన్నారు.
ఈ సందర్భంగా లండన్ స్టాక్ ఎక్సేంజీ గురించి సిఈవో నికిల్ రాఠీ చంద్రబాబు బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ఈ భేటీలో చర్చ జరిగింది. రెండు ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులతో లండన్ స్టాక్ ఎక్సేంజ్‌లో నమోదు అవుతున్న 500 కంపెనీల షేర్లు ప్రస్తుతం అక్కడ ట్రేడ్ అవుతున్నాయి. అమరావతిలో భాగస్వామ్య అంశాలపై చంద్రబాబుతో లండన్ స్టాక్ ఎక్సేంజ్ ప్రతినిధులు చర్చించారు. అదే సమయంలో మౌలిక సదుపాయల కల్పనకు ఆర్థిక వనరులు సమకూర్చే అంశంపై చర్చ జరిగింది. ఫైనాన్షియల్ డ్రిస్టిక్, మౌళిక సదుపాయాల కల్పన కోసం లండన్ స్టాక్ ఎక్సేంజ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ మంత్రి నారాయణ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఉన్నతాధికారులు సతీస్ చంద్ర, పీవీ రమేష్, ఎన్‌ఆర్‌ఐ వ్యహారాల సలహాదారు వేమూరి రవి ఉన్నారు.